నకరికల్లు గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీవో జీ. కాశయ్య పాల్గొన్నారు. ఆయన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నామని ఎంపీడీవో తెలిపారు. పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.