నరసరావుపేట: మహిళల సొమ్ము దారి మళ్లిస్తే జైలుకే

34చూసినవారు
నరసరావుపేట: మహిళల సొమ్ము దారి మళ్లిస్తే జైలుకే
పల్నాడు జిల్లాలో డ్వాక్రా, మెప్మా స్వయం సహాయక సంఘాల నిధుల దుర్వినియోగంపై కలెక్టర్ కృతికా శుక్లా తీవ్రంగా స్పందించారు. అవినీతిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన ఆమె, నిధులు దారిమళ్లించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు, దుర్వినియోగమైన ప్రతి పైసాను రికవరీ చేస్తామని తెలిపారు. అక్రమాల వల్ల నష్టపోయిన మహిళా సంఘాలకు ప్రభుత్వం అండగా నిలిచి, తిరిగి రుణాలు పొందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్