మొంథా తుఫాన్ కారణంగా నష్టపోయిన నకరికల్లు, నరసింగపాడు గ్రామాల్లోని వరి పొలాలను మండల వ్యవసాయ అధికారి (ఇన్ఛార్జ్) నరసింహారావు, తహశీల్దార్ పుల్లారావు శుక్రవారం పరిశీలించారు. పంటలో మొలకలు రాకుండా నివారించడానికి ఉప్పు నీటితో పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. దీనికోసం హెక్సాకోనజోల్, ప్రోపికోనజోల్ రసాయనాలను వాడాలని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు ముస్తాక్ ప్రభాకర్, రైతులు పాల్గొన్నారు.