పల్నాడు: ఓటర్ల జాబితా ప్రక్షాళనపై దృష్టి పెట్టాలి

12చూసినవారు
పల్నాడు: ఓటర్ల జాబితా ప్రక్షాళనపై దృష్టి పెట్టాలి
ఓటర్ల జాబితా ప్రక్షాళనపై జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. గురువారం ఓటర్ల జాబితా తయారీపై అన్ని జిల్లాల కలెక్టర్లకు వర్చువల్ విధానంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. ఓటర్ల జాబితా రూపకల్పన కోసం బిఎల్వోలు సర్వే చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశించారు. ఈ శిక్షణలో కలెక్టర్ కృత్తికా శుక్లా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్