సత్తెనపల్లి వెంకటపతి కాలనీలో గురువారం పాత కక్షల నేపథ్యంలో షేక్ షాజన్ సైదా, మొలకల్లూరు సైదాపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తగాయాలైన బాధితుడిని స్థానికులు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.