సత్తెనపల్లి: అక్కను వేధించినందుకే హత్య

9చూసినవారు
సత్తెనపల్లి: అక్కను వేధించినందుకే హత్య
సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామంలో ఆదివారం రెండు హత్యలు జరిగిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన కృష్ణకుమారి(60) ఆమె కుమారుడు సాంబశివరావు(30)ను విడాకులు తీసుకున్న భార్య సాహితి తమ్ముడు, అతని స్నేహితులు కలిసి హతమార్చారు. మూడేళ్ళ క్రితం ఆమెతో వివాహం జరగగా పిల్లలు పుట్టడం లేదని ఆమెను అత్తింటి వారు వేధించడంతో ఆరు నెలల కిందట విడాకులు తీసుకుంది. అనంతరం మరో యువకుడితో పెళ్లి జరిగింది. అయితే సాంబశివరావు తనతో మాట్లాడాలని చెప్పడంతో ఇబ్బంది పడేది. దీంతో కక్ష పెంచుకున్న యువకుడు స్నేహితులతో కలిసి ఈ ఘటనకు పాల్పడ్డాడు.

సంబంధిత పోస్ట్