బుధవారం నర్సింగపాడు గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గంటలకే భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయంలో దీపాలు వెలిగించి, పొంగల్లు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అర్చకులు పవన్ కుమార్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం, కార్తీక పౌర్ణమి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.