కారంచేడులో నీటి వృథా, రోడ్లపై బురద: ప్రజల ఆవేదన

2027చూసినవారు
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని కారంచేడులో రామానాయుడు కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిలో వాటర్ పైప్ లైన్ లీకేజీతో నీరు వృథాగా పోవడమే కాకుండా, రోడ్డు బురదమయంగా మారి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. గత నెల రోజులుగా ఈ సమస్య కొనసాగుతోందని, సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.