
తుళ్ళూరు: గ్రామ కంఠాల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం
రాజధాని గ్రామాల్లోని గ్రామ కంఠాల సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని సీఆర్డీఏ కమిషనర్ కె. కన్న బాబు తెలిపారు. శనివారం రాయపూడి సమీపంలోని ప్రధాన కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు, రైతుకూలీలు, స్థానికులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, కమిషనర్ వాటిని స్వీకరించారు. అమరావతిలో భూమి వ్యవహారాలకు సంబంధించి 31, అభివృద్ధికి 6, సంక్షేమానికి 4, ప్లానింగ్‌కు 3, ఎస్టేట్స్‌కు 1 చొప్పున మొత్తం 45 అర్జీలు అందాయి.



































