జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 3న గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో సబ్ జూనియర్ బాలబాలికల కబడ్డీ పోటీలు నిర్వహించబడతాయి. ఈ పోటీల అనంతరం జిల్లా జట్లను ఎంపిక చేస్తారు. పాల్గొనే అభ్యర్థులు 16 ఏళ్ల లోపు వారై ఉండాలి. బాలురు 60 కేజీలు, బాలికలు 55 కేజీలు లోపు బరువు ఉండాలి. ఆధార్ కార్డు తప్పనిసరి. సోమవారం మధ్యాహ్నం 1 గంట నుంచి పోటీలు ప్రారంభమవుతాయని, మరిన్ని వివరాలకు 76808 50815, 88012 46431 నంబర్లలో సంప్రదించాలని సంఘం అధ్యక్షుడు కె. మహేష్ తెలిపారు.