నేటి నుంచి జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం రూ.3వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, అడిగినా స్పందన లేదని అసోసియేషన్ తెలిపింది. పాత బకాయిలు చెల్లించకుండానే 2017 రేట్లతో కొత్త హెల్త్ స్కీం తీసుకురావడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. ఆసుపత్రుల మనుగడ కష్టంగా మారిందని, తమ ఆందోళనకు ప్రజలు మద్దతివ్వాలని ఆశా కోరింది.