మేడికొండూరు మండలంలోని సిరిపురం శివారు పొలాల్లో గురువారం కోడి పందేలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఎస్సై ఖాజీబాబు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పోలీసులను చూసి పందెంరాయుళ్లు పరారయ్యారు. అయితే, నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఒక ఆటో, ఒక కోడిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.