గుంటూరుకు చెందిన ఆటో డ్రైవర్ మద్ది తిరుపతయ్య, ప్రైవేటు సంస్థ నుండి తీసుకున్న అప్పును తీర్చలేక అనారోగ్యంతో బాధపడుతూ, గత నెల 28వ తేదీ ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అతని భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అప్పు తీర్చలేకపోతున్నాననే మనోవేదనతోనే అతను అదృశ్యమైనట్లు తెలుస్తోంది.