మేడికొండూరు శివారులో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో షేక్ తాజు (50) అనే కూలీ మృతి చెందాడు. గుర్తు తెలియని ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తాజు అక్కడికక్కడే మరణించగా, ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.