రోడ్డు ప్రమాదంలో పాస్టర్ మృతి

తుళ్లూరు(M) పెదపరిమి వద్ద సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తుళ్లూరు గ్రామానికి చెందిన పాస్టర్ శామ్యూల్ అక్కడికక్కడే మృతి చెందారు. పెదపరిమి వైపు నుంచి అతివేగంగా వస్తున్న లారీ, ఎదురుగా వస్తున్న ఆయన స్కూటీని ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు తుళ్లూరులోని BHPC సంఘంలో పాస్టర్‌గా సేవలందిస్తున్నట్లు తెలిపారు.
