పొన్నెకల్లు గ్రామానికి చెందిన షేక్ మౌలాలి అనే తాపీమేస్త్రిని అక్టోబర్ 27న రాత్రి రావెల గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం అతి వేగంతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని భార్య షేక్ అనూష బేగం శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.