బండారుపల్లి గ్రామానికి చెందిన 42 ఏళ్ల వ్యవసాయ కూలీ మరిపూడి రమేష్, శుక్రవారం పొలంలో పనిచేస్తుండగా ఎడమ కాలికి పాము కాటు వేసింది. చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.