తుళ్ళూరు గ్రామంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో వైశాఖ పౌర్ణమి పురస్కరించుకొని వార్షిక శాంతి కల్యాణం వైభవంగా శుక్రవారం నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త జమ్మల చంద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం, స్వామివారికి శాంతి కల్యాణం నిర్వహించడంతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి గరుడసేవ, గ్రామ ఉత్సవం, హంస వాహన సేవ జరిగాయి. నిత్య హోమం, నిత్యఫలిహరణ కూడా నిర్వహించారు.