తుళ్లూరు: జాబ్ మేళాలో 141 మందికి ఉద్యోగాలు

4చూసినవారు
శుక్రవారం సీఆర్డీఏ ఆధ్వర్యంలో తుళ్లూరులో నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో జరిగిన ఈ మేళాలో మొత్తం 627 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 141 మందికి ఉద్యోగాలు లభించాయి. మరో 43 మందిని ఉద్యోగాలు అందించే సంస్థలు పరిశీలనలో ఉంచాయి. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సీఆర్డీఏ సామాజిక విభాగం సంక్షేమ విభాగం డీసీడీవో బి. శ్రీనివాసరావు, సంస్థల ప్రతినిధులు కలిసి నియామక పత్రాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్