తుళ్లూరు: మండలి చైర్మన్కి క్షమాపణ చెప్పిన అచ్చెన్న

11చూసినవారు
తుళ్లూరు: మండలి చైర్మన్కి క్షమాపణ చెప్పిన అచ్చెన్న
శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన మతపరమైన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మండలి ఛైర్మన్ మోషేన్ రాజును ఉద్దేశించి 'మీరు, మీ నాయకుడు క్రిస్టియన్. శ్రీవారిని నమ్మరు' అని మంత్రి వ్యాఖ్యానించారు. దీనిపై ఛైర్మన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తాను హిందువునని స్పష్టం చేశారు. తన తప్పును తెలుసుకున్న మంత్రి, వెంటనే క్షమాపణలు చెప్పి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్