తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద మంగళవారం ఉదయం వ్యవసాయ పనులకు వెళ్తున్న కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. దుగ్గిరాల మండలం మంచికలపూడి నుండి తుళ్లూరు మండలం పెదపరిమికి 11 మంది కూలీలు ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.