తుళ్లూరు మండలంలోని ఈ-6, ఎన్-11 జంక్షన్ వద్ద ఆర్వీఆర్ సంస్థకు చెందిన సుమారు 480 కిలోల ఇనుప వస్తువులను సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ ఘటనపై భూరీ కన్స్ట్రక్షన్ మేనేజర్ శివ కేశవరావు మంగళవారం తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.