తుళ్లూరు మండలం వెలగపూడిలోని సచివాలయంలో మంగళవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, సీఎస్ కె. విజయానంద్, ట్రాన్స్ కో, జెన్కో అధికారులు, డిస్కమ్ ల సీఎండీలు పాల్గొన్నారు. విద్యుత్ సరఫరా, పీఎం కుసుమ్, సోలార్ రూఫ్ టాప్, విద్యుత్ ఉత్పత్తి, పంపిణీలో వ్యయం తగ్గింపు వంటి అంశాలపై చర్చ జరిగింది.