తుళ్లూరు: నేడు డీసీసీబీ అక్రమాలపై సమావేశం

6చూసినవారు
తుళ్లూరు: నేడు డీసీసీబీ అక్రమాలపై సమావేశం
గత వైకాపా ప్రభుత్వ హయాంలో డీసీసీబీ బ్యాంకుల్లో జరిగిన అక్రమాలపై శాసనసభలో ప్రస్తావన రావడంతో హౌస్ కమిటీని నియమించారు. ఈ కమిటీ సోమవారం సచివాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో గుంటూరుతో పాటు మరో ఏడు జిల్లాల సహకార శాఖ అధికారులు, బ్యాంకు సీఈవోలు పాల్గొంటారు. ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్