తుళ్లూరు: ఫిడే చెస్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన డీజీపీ

2చూసినవారు
అమరావతిలోని విఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఫిడే చెస్ టోర్నమెంట్‌ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రారంభించారు. జూన్ 1 నుంచి 8 వరకు జరిగే ఈ పోటీలను ఆంధ్ర చెస్ అసోసియేషన్, విఐటీ-ఏపీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా డీజీపీ యాంటీ డ్రగ్ పోస్టర్‌ను ఆవిష్కరించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అమరావతి భవిష్యత్ నగరంగా ఎదుగుతోందని, సీఎం చంద్రబాబు నాయుడు కృషితో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలు మరిన్ని జరుగుతాయని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్