తుళ్లూరు: లంక గ్రామాల్లో తగ్గిన వరద ప్రవాహం
తుఫాన్ కారణంగా కృష్ణా నదికి వరద ఉధృతి పెరగడంతో, తుళ్లూరు మండలం తాళాయిపాలెం గ్రామంలో లంక గ్రామాలకు వరద ముప్పు ఏర్పడింది. దీంతో గురువారం కొందరు స్థానికులు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. శుక్రవారం ఉదయానికి వరద ప్రభావం తగ్గి నీరు వెనక్కి వెళ్ళడంతో, గ్రామస్తులు తిరిగి తమ స్వగృహాలకు చేరుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వరద వల్ల ఇళ్లలోకి చేరిన బురదను శుభ్రం చేసుకునే పనులు కూడా ప్రారంభమయ్యాయి.
