మంత్రి పయ్యావుల కేశవ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. శాసనసభను రాజకీయాలకు వేదికగా మార్చవద్దని ఆయన హితవు పలికారు. జగన్కు దేవుడంటే నమ్మకం లేదని, ఆయన అసలు తిరుపతికి వెళ్లరని మంత్రి ఆరోపించారు. లడ్డూ కల్తీ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ తీరును తప్పుబడుతూ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు సభలో వేడిని పెంచాయి.