తుళ్లూరు: బైక్ ను ఢీ కొట్టిన లారీ.. మహిళకు గాయాలు..

5చూసినవారు
తుళ్లూరు: బైక్ ను ఢీ కొట్టిన లారీ.. మహిళకు గాయాలు..
తుళ్లూరు మండలం, ఉద్దండరాయునిపాలెం వద్ద సీడ్ యాక్సెస్ రోడ్డుపై మంగళవారం టూ వీలర్ పై వెళుతున్న భార్యాభర్తలను వెనుక నుండి టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టూ వీలర్ వెనుక కూర్చున్న మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, గాయపడిన మహిళను 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్