శుక్రవారం సాయంత్రం తుళ్లూరు మండలం వెంకటపాలెం సమీపంలో మంత్రి ప్రోటోకాల్ కారు ఢీకొని పవన్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. విజయవాడ నుంచి సచివాలయం వైపు వస్తున్న ప్రోటోకాల్ వాహనాన్ని, విజయవాడ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్న పవన్ మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం వద్ద ఢీకొట్టాడు. గాయపడిన పవన్‌ను ప్రోటోకాల్ వాహనంలోనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.