రైతులకు ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ బుధవారం వెలగపూడిలో మీడియా సమావేశంలో అన్నారు. ఇప్పటివరకు 29,644 మంది రైతులకు 34,192.19 ఎకరాలకు ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,727 మంది రైతులకు 3,188 ఎకరాలకు ప్లాట్ల కేటాయింపు జరిగిందని తెలిపారు. రిటర్నబుల్ ప్లాట్లలో ఇంకా 2,501 మందికి 8,441 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందని, వీటిని త్వరలో పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.