తుళ్లూరు: రోడ్డుపై పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు

15చూసినవారు
తుళ్లూరు ప్రధాన రహదారులపై టీ బంకుల వద్ద ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తూ వాహనాలు పార్క్ చేస్తున్న వారిపై పోలీసులు గురువారం రాత్రి కేసులు నమోదు చేశారు. రోడ్లపై దుకాణాల ముందు వాహనాలను పార్కింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. దుకాణాలకు వచ్చే వాహనదారులు రోడ్లపై వాహనాలు నిలపకుండా దుకాణదారులే చూసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్