తుళ్లూరు: రైతుల త్యాగంతోనే రాజధాని అమరావతి నిర్మాణం

2చూసినవారు
తుళ్లూరు: రైతుల త్యాగంతోనే రాజధాని అమరావతి నిర్మాణం
హోమ్ మినిస్టర్ అనిత తుళ్లూరులో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, రైతుల త్యాగంతోనే రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని, పోలీసులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణలను దీటుగా ఎదుర్కొంటామని, పోలీసులపై తప్పుడు ప్రచారం సహించబోమని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను అడ్డుకుంటామని, పోలీసులకు నూతన సాంకేతికత అందిస్తామని, 6100 పోస్టులను భర్తీ చేస్తున్నామని అనిత తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్