
లైట్ హౌస్‌ను సందర్శించిన రాహుల్ గాంధీ (వీడియో)
నికోబార్ ద్వీపంలోని లైట్ హౌస్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సందర్శించారు. 1984లో ప్రధాని హోదాలో ఇందిరా గాంధీ ఇక్కడ పర్యటించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. 42 ఏళ్ల తర్వాత అదే చోట నిలబడటం గర్వంగా ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. భారతదేశ వైవిధ్యం, సముద్ర తీరాల సౌందర్యం అద్భుతమని ఆయన కొనియాడారు. ఇందిరా గాంధీ తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించిన ప్రధాన నేతగా రాహుల్ నిలిచారు.




