అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న హైకోర్టు జడ్జిల నివాస సముదాయాలు, శాశ్వత హైకోర్టు భవనాల భద్రతపై ఉన్నతాధికారులు సమీక్షించారు. గుంటూరు జిల్లా ఎస్పీ వాకుల్ జిందల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాటి భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని సూచించారు. సీసీటీవీ నిఘా, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు, యాక్సెస్ కంట్రోల్ వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ పర్యవేక్షణను బలోపేతం చేయాలని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర భద్రతా ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు.