తుళ్లూరు మండలంలోని పెద్ద పరిమి గ్రామం వద్ద కొట్టేళ్ల వాగు రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పొంగి ప్రవహిస్తోంది. అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా బుధవారం ఉదయం ఈ మార్గంలో ట్రాక్టర్లను అడ్డుపెట్టి రాకపోకలను నిలిపివేశారు. వర్షం ఆగితే కొన్ని గంటల్లో వాగు సాధారణ స్థాయికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. తుళ్లూరు నుంచి తాడికొండ మీదుగా గుంటూరు వెళ్లే ప్రధాన మార్గం ఇదే కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.