తెనాలిలో దొంగ అనుకుని యువకుడికి దేహశుద్ధి

0చూసినవారు
తెనాలిలో దొంగ అనుకుని యువకుడికి దేహశుద్ధి
గుంటూరు జిల్లా తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహాల వద్ద గురువారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని స్థానికులు దొంగ అని భావించి పట్టుకుని దేహశుద్ధి చేశారు. తెనాలి రూరల్ పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు హిందీ మాత్రమే మాట్లాడుతున్నాడని, జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవాడని గుర్తించారు. రైళ్లలో యాచిస్తూ జీవనం సాగిస్తున్నట్లు భావిస్తున్నారు. పోలీసులు అతనికి ఆహారం పెట్టి, రైలు ఎక్కించి పంపించారు.

సంబంధిత పోస్ట్