ధర్మసత్రం ఈవోపై ఆరోపణలు: సాక్ష్యాలతో తిరుపతికి రావాలని సవాల్

2614చూసినవారు
ధర్మసత్రం ఈవోపై ఆరోపణలు: సాక్ష్యాలతో తిరుపతికి రావాలని సవాల్
తెనాలిలోని శ్రీ కాకుమాను శంకరుని ధర్మసత్రం ఈవో శివారెడ్డిపై ట్రస్ట్ ఫ్యామిలీ మెంబర్ శరత్ చేసిన ఆరోపణలపై ఈవో స్పందించారు. షాపులీజుదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం, చెక్కులు డ్రా చేసుకుని వాడుకోవడం, అధిక వసూళ్లు వంటి ఆరోపణలను శరత్ చేశారు. ఈ ఆరోపణలపై సాక్ష్యాలతో తిరుపతిలో దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వద్దకు వచ్చి నిర్ధారణ చేయాలని ఈవో కోరారు. సత్యనారాయణ టాకీస్ బకాయిల విషయంలో శరత్‌ను నిలదీయగా, బెదిరింపులకు గురైనట్లు ఈవో తెలిపారు. 1992లో శరత్ తండ్రికి, ఆయనకు ట్రస్ట్ ఫ్యామిలీ మెంబర్ పదవి ఎలా వచ్చిందో అనుమానాలు వ్యక్తం చేశారు. జిల్లా అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్, తిరుపతి రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ పూర్తి దర్యాప్తు చేయాలని ఈవో కోరారు.

సంబంధిత పోస్ట్