ఆర్యవైశ్యులను అవమానించిన పంచ్ ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని తెనాలి ఆర్యవైశ్య సంఘాల నాయకులు శుక్రవారం వన్ టౌన్ సీఐ రాంబాబుకు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ డిజి వెంకటేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రభాకర్ పై వెంటనే కేసు నమోదు చేయాలని సంఘ నాయకులు పెండేల వెంకట్రావు, కిషోర్, సుబ్బారావు, అనంత్ తదితరులు కోరారు.