బైక్ పార్కింగ్ వివాదం..తెనాలిలో వ్యక్తిపై దాడి

2954చూసినవారు
తెనాలి మండలం అంగలకుదురులో బైక్ పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసింది. వెలగా తులసి రామ్ అనే వ్యక్తిపై షేక్ నాగుల్ మీరా, మరో ఐదుగురు కలిసి ఆయన ఇంటి వద్దే దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రూరల్ ఎస్ఐ ఆనంద్ కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని ఎస్ఐ బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్