ఫేక్ ప్రచారం పై పోలీసులకు ఫిర్యాదు

5చూసినవారు
ఫేక్ ప్రచారం పై పోలీసులకు ఫిర్యాదు
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారంలో తన పేరు, ఫోటోలను ప్రస్తావిస్తూ వైసీపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారం చేస్తోందని తెనాలికి చెందిన టీడీపీ నాయకురాలు జెట్టా రేణుక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ నాయుడు తనకు రూ.20 లక్షల కారు గిఫ్ట్‌గా ఇచ్చారని, అది చాలక రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ వీడియోలు విడుదల చేశానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఫేస్‌బుక్ ఖాతాలపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు.

సంబంధిత పోస్ట్