దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా, ఆయన స్వగ్రామమైన బుర్రిపాలెంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్తుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురు వైద్య నిపుణులు పాల్గొని ఆరోగ్య
పరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కృష్ణ సేవా స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.