తెనాలి డివిజన్ లో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం

0చూసినవారు
తెనాలి డివిజన్ లో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం
గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 341.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. తెనాలిలో 64.4, దుగ్గిరాల 47.6, తాడేపల్లి 45.6, కొల్లిపర 32.4, చేబ్రోలు 60.6, మంగళగిరి 41.6, పొన్నూరు 30.4, కాకుమాను 19.2 మిల్లీ మీటర్ల మేర వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. గురువారం రాత్రి నుండి ఉదయం వరకు కురిసిన అకాల వర్షం కారణంగా అనేకచోట్ల చెట్లు కూలి, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడి, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

సంబంధిత పోస్ట్