కొల్లిపర: రాత్రి సమయంలోను రైతులను పరామర్శించిన మంత్రి

2279చూసినవారు
గురువారం రాత్రి కొల్లిపర మండలం బొమ్మువారిపాలెం గ్రామంలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాల రైతులను నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాన్ని రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కచ్చితంగా కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటామని, రైతులందరూ అధైర్య పడవద్దని మనోహర్ ధైర్యం చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్