రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం కొల్లిపర మండలంలో పర్యటించనున్నారు. కొల్లిపర శివారులోని వీరభద్ర (బీసీ) కాలనీలో ఉదయం 9 గంటలకు లబ్ధిదారులకు
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం బొమ్మువానిపాలెంలో రైతులతో సమావేశమై వారి సమస్యలు, వ్యవసాయ అంశాలపై చర్చించనున్నారు.