ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


బంగారం కొనడం మానేస్తే దేశానికి లాభమా? నష్టమా?
May 30, 2026, 14:05 IST/

బంగారం కొనడం మానేస్తే దేశానికి లాభమా? నష్టమా?

May 30, 2026, 14:05 IST
భారతీయులు ఏడాది పాటు బంగారం కొనడం మానేస్తే దేశ ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశీయంగా, ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు పడిపోతాయి. దిగుమతులపై భారీగా ఖర్చయ్యే డాలర్లు ఆగిపోయి, రూపాయి విలువ పెరుగుతుంది. వాణిజ్య లోటు తగ్గి ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతుంది. అయితే, ఆభరణాల పరిశ్రమ కుదేలై లక్షలాది మంది ఉపాధి కోల్పోతారు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసరాలకు, రుణాలకు బంగారమే ఆధారం. స్మగ్లింగ్ పెరిగే అవకాశం ఉంది. సాంస్కృతికంగా పెనవేసుకుపోయిన బంగారాన్ని పూర్తిగా వదిలేయడం ఆచరణ సాధ్యం కాదని నిపుణులు పేర్కోంటున్నారు.