ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


జగన్ కుట్ర రాజకీయాలు మానడం లేదు: లోకేష్
May 31, 2026, 09:05 IST/

జగన్ కుట్ర రాజకీయాలు మానడం లేదు: లోకేష్

May 31, 2026, 09:05 IST
AP: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తన కార్యకర్తలను రంగంలోకి దింపారని మంత్రి లోకేష్ ఆరోపించారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహ ధ్వంసం ఘటన వెనుక వైసీపీ కుట్ర ఉందని, నిందితుడు వైసీపీ నేతల అనుచరుడేనని పోలీసుల విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. బాబాయ్ గుండెపోటు, కోడి కత్తి, గులకరాయి వంటి నాటకాలతో ప్రజలను మోసం చేసిన జగన్, ఇప్పుడు కూడా అదే తరహా కుట్ర రాజకీయాలు చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. "ఎన్నిసార్లు దొరికిపోయినా మీ కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా జగన్?" అని ఆయన సూటిగా ప్రశ్నించారు.