తెనాలి: భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం

3899చూసినవారు
తెనాలి పట్టణంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కారణంగా వీధులన్నీ జలమయం అయ్యాయి. బోసురోడ్డుతో పాటు అనేక ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. కాల్వలు పొంగి మురుగు నీరు రోడ్లపైకి చేరడంతో డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోయి నీరు నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ వర్షం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సంబంధిత పోస్ట్