తెనాలి: సచివాలయ ఉద్యోగి దాడి చేశాడని ఫిర్యాదు

16చూసినవారు
తెనాలి: సచివాలయ ఉద్యోగి దాడి చేశాడని ఫిర్యాదు
గురువారం తెనాలి మండలం ఖాజీపేట గ్రామానికి చెందిన వృద్ధుడు వెంకటసుబ్బయ్య, గతంలో తమ గ్రామ సచివాలయంలో పనిచేసి ప్రస్తుతం కొల్లిపర మండలంలో విధులు నిర్వహిస్తున్న మధుసూదనరావు అనే వ్యక్తి తనపై దాడి చేశాడని గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక పని నిమిత్తం రూ. 20 వేలు తీసుకుని పని చేయలేదని, ప్రశ్నించినందుకు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్