తెనాలి: వివాహిత అదృశ్యంపై ఫిర్యాదు

10చూసినవారు
తెనాలి: వివాహిత అదృశ్యంపై ఫిర్యాదు
పట్టణ పరిధిలోని గంగానమ్మపేటలో నివాసముంటున్న వివాహిత, తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టింటికి వచ్చింది. దంపతుల మధ్య గొడవ జరిగిన తర్వాత భర్త తన ఊరు మిర్యాలగూడెం వెళ్ళాడు. ఈ నెల ఒకటో తేదీన అల్పాహారం తెస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఆమె సోమవారం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్