తెనాలి: హత్య కేసులో ముమ్మర దర్యాప్తు.. రంగంలోకి దిగిన డీఎస్పీ

9చూసినవారు
తెనాలి: హత్య కేసులో ముమ్మర దర్యాప్తు.. రంగంలోకి దిగిన డీఎస్పీ
తెనాలి టీచర్స్ కాలనీలో ఏసీ మెకానిక్ షేక్ ఫయాజ్ అహ్మద్ దారుణ హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం డీఎస్పీ జనార్ధన రావు, సీఐ సాంబశివరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రాత్రి 11 గంటల సమయంలో ఫయాజ్ తనకు పరిచయం ఉన్న మహిళ ఇంటికి వెళ్లగా, అక్కడ కాపు కాసి ఉన్న దుండగులు కర్రలు, బండరాళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది, హత్యకు గల కారణాలపై విచారణ జరుగుతోందని డీఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్